కాకినాడ కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
కాకినాడ ప్రెజర్ పేటకు చెందిన మహిళ మందపల్లి శ్రీదేవి సోమవారం కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
Advertisement
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైసీపీ నాయకులు తన స్థలానికి సంబంధించి కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తనను బెదిరిస్తున్నారని శ్రీదేవి అనే మహిళ పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న రాత్రి బెదిరింపులు రావడంతోనే సూసైడ్ అటెంప్ట్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మహిళ బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.
Advertisement