లోకేష్ హామీలను నమ్ముతారా..?

97 నియోజకవర్గాల్లో 3,132 కిలోమీటర్లు నడిచి బాధితుల కనీళ్ళు తుడిచినట్లు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ తనకు చెప్పని పాఠాలన్నెంటినో తాను పాదయాత్రలో నేర్చుకున్నట్లు చెప్పారు.

Advertisement
Update:2023-12-20 11:08 IST

యువగళం, నవగళం, ఆంధ్రులగళమంటూ ఎల్లోబ్యాచ్‌ విపరీతమైన‌ హడావుడి చేస్తోంది. మీడియా మద్దతుంటే ఏ స్థాయిలో ప్రచారం చేసుకోవచ్చనే విషయం ఎల్లోమీడియా హడావుడి చూస్తే అర్థ‌మైపోతుంది. మయసభలో లాగ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపించటంలో ఎల్లోమీడియా+టీడీపీది అందెవేసిన చెయ్యి. ఫార్టీ ఇయర్స్ గా ఇండస్ట్రీలో చంద్రబాబునాయుడు ఇలాగే నెట్టుకొస్తున్నారు. ఈరోజు సాయంత్రం పోలిపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరగబోతోంది. ఈ సభ ఎందుకంటే.. నారా లోకేష్ పాదయాత్ర యువగళం సూపర్ సక్సెస్ అయినందుకట.

97 నియోజకవర్గాల్లో 3,132 కిలోమీటర్లు నడిచి బాధితుల కనీళ్ళు తుడిచినట్లు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ తనకు చెప్పని పాఠాలన్నెంటినో తాను పాదయాత్రలో నేర్చుకున్నట్లు చెప్పారు. ఇలాంటి మాటలను లోకేష్ చాలానే చెప్పారు కానీ, ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్నివిషయాలపైనే జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే.. దారి తప్పిన పరిపాలనను గాడిలో పెడతారట. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తారట. 20 లక్షల ఉద్యోగాలిస్తామని, పన్నులు తగ్గిస్తామని, ఏపీని ఒకప్పటి తమిళనాడు కానివ్వమని చాలానే చెప్పారు.

ఇవి కాకుండా మహానాడు సందర్భంగా రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక్కడే అందరికీ లోకేష్ మాటలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చేస్తామంటూ ఇచ్చిన హామీల్లో చాలావరకు 2014లో ఇచ్చినవే. రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ఉద్యోగాలు లేకపోతే ఉపాధి, పరిశ్రమలను తీసుకొస్తామని ఇలా చాలానే చెప్పారు. వీటిల్లో ఏ ఒక్కహామీని కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు.

పైగా రుణమాఫీ హామీని సంపూర్ణంగా చేసేసినట్లు బుకాయించారు. చంద్రబాబునే నమ్మని జనాలు ఇప్పుడు లోకేష్ హామీలను నమ్ముతారా..? అన్నదే ప్రశ్న. ఎందుకంటే.. తాము హామీలిచ్చి అమలుచేయంది ఎప్పుడో 20 ఏళ్ళక్రితం కాదు. మొన్న 2014-19లోనే అన్న విషయాన్ని తండ్రి, కొడుకులు మరిచిపోయినట్లున్నారు. హామీలను అమలుచేయటంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు జనాలందరికీ తెలుసు. 2014లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేశాం కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా హామీలను అమలుచేసేస్తామని లోకేష్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News