హెల్త్ యూనివర్శీటి పేరు మారుస్తారా?
ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శీటీ పేరును మార్చాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్సార్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శీటీ పేరును మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సమాచారం. ప్రభుత్వంలో పార్టీలు మారినప్పుడల్లా పథకాల పేర్లు, సంస్థల పేర్లు మార్చడం మామూలే. టీడీపీ హయాంలో కూడా ఇలాగే చాలా పేర్ల మార్పు జరిగింది. పథకాలకు చంద్రన్న..ఎన్టీఆర్ వంటి పేర్లు పెట్టారు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు.
తాజాగా జగన్ సర్కార్ విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శీటీ పేరును మార్చడానికి సిద్దం అయినట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికోసం వారం క్రితమే యూనిర్శిటీ నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు.
1986 లో స్థాపించిన ఈయూనివర్శిటీ వైద్య విద్యకోసం విశేష కృషి చేస్తోంది. ఆరంభంలో దీని పేరు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆప్ ఎ.పి.గా ఉండేది. 1999 సమయంలో దీన్ని ఎన్. టి.ఆర్. హెల్త్ సైన్సెస్ ఆఫ్ ఏపీ గా మార్చారు. తర్వాత డాక్టర్ ఎన్.టి.ఆర్. హెల్త్ సైన్సెస్ గా మార్చారు.
ఇప్పుడు వైసీపీ సర్కార్ దీని పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చే అవకాశం ఉంది. క్యాబినెట్ అనుమతి కోసం మంత్రులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.