పవన్ పోస్టర్ కనబడలేదా?

జగన్ విషయంలో బీజేపీకి కనిపించిన మత రాజకీయం, ఓట్ల రాజకీయం పవన్ కల్యాణ్ విషయంలో కనబడలేదా? కోటప్పకొండ దగ్గర పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులు పరమశివుడిగా చిత్రీకరించిన పెద్ద పోస్టర్లుంచారు. జనసేన కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సుమారు 20 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement
Update: 2023-02-20 05:41 GMT

మహా శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోని ఒక పోస్టుపై బీజేపీ నానా రాద్ధాంతం చేస్తోంది. శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పటంతో పాటు పార్టీ ఒక ఫొటోను పెట్టింది. అందులో ఒక చిన్న బాలుడికి జగన్మోహన్ రెడ్డి పాలు తాగిస్తున్నట్లుంది. ఇంకేముంది పరమశివుడిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని, జగన్ మత రాజకీయాలు చేస్తున్నాడంటు గగ్గోలుపెట్టింది. ఆ పోస్టును పట్టుకుని రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దియోధర్ అయితే జగన్‌ను లిక్కర్ మాఫియా పార్టీ అని బెయిల్ మీద బయటున్న సీఎం అంటు నానా చెత్త పోస్టు చేశారు.

ఇక బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అయితే జగన్ హిందువులకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అన్నీ శివాలయాల దగ్గర ఆందోళనలు చేయాలని కూడా పిలుపిచ్చేశారు. మరి వీర్రాజు పిలుపును ఎంతమంది పట్టించుకున్నారో తెలీదు. నిజానికి అందులో పరమశివుడిని అవమానించేట్లుగా ఎక్కడా లేదు. ఆకలితో ఉన్న బాలుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా మాత్రమే ఉంది. సరే బీజేపీ రాజకీయం ఇలాగే ఉంటుందని అనుకుందాం.

మరి ఇదే నీతి మిత్రపక్షమైన జనసేనకు కూడా వర్తిస్తుంది కదా. జగన్ విషయంలో కనిపించిన మతరాజకీయం, ఓట్ల రాజకీయం పవన్ కల్యాణ్ విషయంలో కనబడలేదా? కోటప్పకొండ దగ్గర పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులు పరమశివుడిగా చిత్రీకరించిన పెద్ద పోస్టర్లుంచారు. జనసేన కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సుమారు 20 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ఆ కటౌట్లో పరమశివుడిగా పవన్ కనబడుతున్నారు. పరమశివుడి గెటప్‌లో ఏర్పాటుచేసిన పవన్ పోస్టర్ బీజేపీ నేతలకు ఓట్ల రాజకీయంగాను, హిందువుల మనోభావాలను అవమానించేదిగా కనబడలేదా? చిన్న పిల్లాడి ఆకలి తీర్చేట్లుగా ఉన్న జగన్ ఫొటోనే వీర్రాజు, దేవధర్‌కు ఓట్ల రాజకీయంగా కనబడినపుడు, మరి పవన్ గెటప్‌లో పవన్ పోస్టర్‌పై వీళ్ళెందుకు నోరిప్పటంలేదు? అంటే పవన్ పోస్టర్ ఎలాగున్నా ఓకేనా? మిత్రపక్షమైతే అభ్యంతరం చెప్పేందుకు నోరులేవదా?

Tags:    
Advertisement

Similar News