పవన్ నోరెత్తటం లేదే.. షాక్‌లో ఉన్నాడా?

సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుతో పాటు పవన్‌కు కూడా పెద్ద షాకిచ్చిందనే అర్థ‌మవుతోంది. సిట్ విచారణలో చంద్రబాబు అండ్ కో అడ్డంగా దొరికిపోతే అప్పుడు ఏమవుతుంది? తర్వాత రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయో అర్థంకాకే పవన్ నోరు విప్ప‌లేకపోతున్నట్లున్నారు.

Advertisement
Update:2023-05-04 10:46 IST

పవన్ నోరెత్తటం లేదే.. షాక్‌లో ఉన్నాడా?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు లేవటంలేదు. చంద్రబాబు హయాంలో అమరావతి భూ కుంభకోణంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతి భూకుంభకోణంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. వెంటనే తమ్ముళ్ళు హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. దానిపై ఏపీ ప్రభుత్వం చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది.

నిజంగా సుప్రీంకోర్టు నిర్ణయం చంద్రబాబు అండ్ కో కు షాకనే చెప్పాలి. ఇప్పటికే కుంభకోణం జరిగిందనేందుకు అవసరమైన ఆధారాలను సిట్ సేకరించిందట. ఇక సూత్రధారులకు, పాత్రదారులందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుద్దామని రెడీ అవుతున్న విషయం తెలుసుకుని హైకోర్టులో తమ్ముళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేని వెకేట్ చేయించటానికి ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది.

మరింతటి కీలకమైన సుప్రీంకోర్టు ఆదేశాలపైన చంద్రబాబు మిత్రుడు పవన్ ఎందుకని నోరు విప్పటంలేదు? కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా లేదా స్టే ఇచ్చినా వెంటనే పవన్ జగన్‌కు వ్యతిరేకంగా రెచ్చిపోతుంటారు. జనసేన ట్విట్టర్ ఖాతాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా ఎంతగా చెలరేగిపోతారో అందరు చూస్తున్నదే. మరిప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించటంలో తప్పులేదని సుప్రీంకోర్టు అనుమతి మీద మాత్రం పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

పవన్‌కు అంటే నోరులేవట్లేదని అనుకుందాం. మరి నాదెండ్ల మనోహర్‌కు ఏమైంది? తనైనా మాట్లాడాలి కదా. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుతో పాటు పవన్‌కు కూడా పెద్ద షాకిచ్చిందనే అర్థ‌మవుతోంది. సిట్ విచారణలో చంద్రబాబు అండ్ కో అడ్డంగా దొరికిపోతే అప్పుడు ఏమవుతుంది? తర్వాత రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయో అర్థంకాకే పవన్ నోరు విప్ప‌లేకపోతున్నట్లున్నారు. ఇలాంటి అనుమానాలతోనేనా ఎందుకైనా మంచిదని పవన్ మిత్రపక్షం బీజేపీని వదిలిపెట్టనిది?

Tags:    
Advertisement

Similar News