పీవీకి, ఎన్టీఆర్‌కి లేని సంస్మరణ సభ.. రామోజీకా?.. - చంద్రబాబుకు హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్న

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు రామోజీరావు ప్రముఖ పాత్ర వహించినందుకే రామోజీకి సంతాప సభ ఇంత భారీగా నిర్వహించారా అని నిలదీశారు.

Advertisement
Update:2024-06-28 07:27 IST

భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంస్మరణ సభ నిర్వహించలేదని.. ఏ అర్హత ఉందని ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జరిపిందని వైసీపీ రాష్ట్ర నేత, హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు రామోజీరావు ప్రముఖ పాత్ర వహించినందుకే రామోజీకి సంతాప సభ ఇంత భారీగా నిర్వహించారా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని రాజారెడ్డి విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News