ఏపీలో ఆరు పథకాలకు పేర్లు మార్పు.. ఆ పథకానికి బాబు పేరు

పథకాల పేర్లు మార్చడంతో పాటు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-06-18 23:45 IST

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో ఆరు పథకాలకు పేర్లు మార్చింది. ఈ మేరకు సోషల్‌ వెల్ఫేర్ మినిస్టర్ డోల బాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. పథకాల పేర్ల నుంచి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లను తొలగించింది కొత్త ప్రభుత్వం. 4 సంక్షేమ పథకాలకు సాధారణ పేర్లను ఉంచిన కూటమి ప్రభుత్వం.. ఓ పథకానికి చంద్రబాబు పేరు, మరో పథకానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును చేర్చింది.


పేర్లు మార్చిన ఆరు పథకాలు ఇవే -

1. జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ( RTF)

2. జగనన్న వసతి దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ (MTF)

3. జగనన్న విదేశీ విద్యాదీవెన - అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యా నిధి

4. YSR కల్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక

5. YSR విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతి

6. జగనన్న సివిల్ సర్వీసెస్‌ ప్రోత్సాహకం - ఇన్సెంటివ్స్‌ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్


పథకాల పేర్లు మార్చడంతో పాటు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. 2019 -24 మధ్య అంటే జగన్‌ సర్కార్‌ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లు తొలగించాలని సూచించింది. ఆ పథకాలకు కొత్త పేర్లు ప్రకటించేవరకు సాధారణ పేర్లు వాడాలని పేర్కొంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పార్టీ జెండాల రంగులు తీసేయాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News