కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్దం కావాలి : జగన్
రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.
Advertisement
ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాటకు సిద్దమైంది. డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.
ఈ నెల 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళన, జనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.
Advertisement