వివేకా హత్య కేసు :వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని మళ్ళీ విచారణకు పిలిచిన సీబీఐ

పులివె‍ందుల వెళ్ళిన సీబీఐ సిబ్బంది అవినాశ్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు నాలుగు సార్లు సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించింది. రేపటి విచారణకు హాజరవడానికి అవినాశ్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Advertisement
Update:2023-04-16 21:17 IST

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఈ రోజు సాయంత్రం అవినాశ్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సిబీఐ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

పులివె‍ందుల వెళ్ళిన సీబీఐ సిబ్బంది అవినాశ్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు నాలుగు సార్లు సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించింది. రేపటి విచారణకు హాజరవడానికి అవినాశ్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

మరో వైపు ఈ రోజు ఉదయం సీబీఐ అరెస్టు చేసిన భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Tags:    
Advertisement

Similar News