ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌

గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయన్నడీజీపీ

Advertisement
Update:2025-01-28 12:09 IST

ఏపీలో సైబర్‌ క్రైమ్‌ పెరిగిందని.. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్‌ క్రైమ్‌ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీన్ని ఎలా అదుపు చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తే డబ్బులు చెల్లించవద్దన్నారు. సైబర్‌ క్రైమ్‌ను నిరోధించడానికి అవగాహనే ఏకైక మార్గమని అన్నారు. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగికదాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్యసమాజం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఐదుగురు క్యాబినెట్‌ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్‌ సంస్థను ఏర్పాటు చేసి గంజాయికి అడ్డుకట్ట వేస్తున్నట్లు వివరించారు. గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37 వేల కిలోల గంజాయిని దగ్ధం చేయనున్నట్లు వివరించారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరుతో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి కాలేజీల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు.

Tags:    
Advertisement

Similar News