మీ ఎమ్మెల్యేను నిలదీయండి.. మేడం నేను 2019లో వచ్చా..

వాస్తవానికి నిర్మలా సీతారామన్ నిధులు మంజూరు చేసింది ఇప్పుడు కాదు 2016లో. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. నిర్మలా సీతారామన్‌ తాను 2016లోనే నిధులు మంజూరు చేశానని స్పష్టంగానే చెప్పారు

Advertisement
Update:2022-10-28 09:17 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలకు ఎంపీ నిధులు మంజూరు చేశారు. తాజాగా భీమవరం పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి తాను నిధులు మంజూరు చేసినా ఇంకా గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించలేదని.. అలా ఎందుకు కల్పించలేదో ఎమ్మెల్యేను నిలదీయండి అని స్థానికులకు సూచించారు. దాంతో టీడీపీ సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నిధులు ఇచ్చినా పనులు చేయలేని ప్రభుత్వం అంటూ ట్రోలింగ్ మొదలైంది. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

వాస్తవానికి నిర్మలా సీతారామన్ నిధులు మంజూరు చేసింది ఇప్పుడు కాదు 2016లో. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. నిర్మలా సీతారామన్‌ తాను 2016లోనే నిధులు మంజూరు చేశానని స్పష్టంగానే చెప్పారు. నిధులిచ్చినా గ్రామాలకు తాగు నీరు ఎందుకు అందలేదో మీ ఎమ్మెల్యేను నిలదీయండి అంటూ కేంద్రమంత్రి సూచించారు.

అందుకు స్పందించిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ కూడా తాను 2019 తర్వాత ఎమ్మెల్యేగా వచ్చాను మేడం... 2016లో ఇచ్చిన నిధులను అప్పటి ఎమ్మెల్యే ఏం చేశారో అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై మీ సహకారంతో పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. మా సహకారం లేకుంటే మీ వాళ్లు చేయరా అంటూ నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News