జగన్ కి మద్దతు తెలిపిన ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు

రాష్ట్రంలోని ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు సీఎం జగన్ ని కలిశారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తామని జగన్ ధైర్యంగా చెబుతున్నారని, అందుకే ఆయనే మళ్లీ సీఎం కావాలని వారు అంటున్నారు.

Advertisement
Update:2024-05-10 11:57 IST

ఏపీ ఎన్నికల్లో ముస్లింలు ఎటువైపు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో చేతులు కలిపిన టీడీపీ.. ముందుగానే ముస్లిం ఓట్ల విషయంలో ఆశలు వదిలేసుకుంది. అయితే ఊరూ పేరూ లేని కొన్ని సంస్థలు చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ముస్లింలు తమ మద్దతు జగన్ కే నంటున్నారు. 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెబుతున్న ఆయనకే తమ ఓటు అని తీర్మానించారు. తాజాగా ముస్లిం ఉలేమాలు, జమాత్‌ ప్రతినిధులు సీఎం జగన్ ని కలసి తమ మద్దతు ప్రకటించారు.


రాష్ట్రంలోని ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు సీఎం జగన్ ని కలిశారు. ఎన్నికల ప్రచారంలో వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జగ్ ని కలిసి తమ మద్దతు తెలిపారు ముస్లిం ప్రతినిధులు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తామని జగన్ ధైర్యంగా చెబుతున్నారని, అందుకే ఆయనే మళ్లీ సీఎం కావాలని వారు అంటున్నారు. ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది కూడా జగనేనంటున్నారు. తమకు అన్నివిధాలుగా అండగా ఉన్న జగన్ కి ఎన్నికల సమయంలో తాము అండగా ఉంటామని తీర్మానించారు.

హామీలు అమలు చేసిన జగన్ ఓవైపు, హామీలు అమలు చేసిన చరిత్రే లేని చంద్రబాబు మరోవైపు ఉంటే.. ఎవరైనా ఏవైపు మొగ్గుచూపుతారు. ముస్లింలు కూడా ఏపీలో జగన్ కే పూర్తిగా మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏలో చేరిన చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామంటున్నారు.  

Tags:    
Advertisement

Similar News