ఏది నిజం..? ఏది అబద్ధం..? శ్రీవారి భక్తుల్లో గందరగోళం..

స్పెషల్ దర్శనం టికెట్ రేట్లను టీటీడీ తగ్గించిందా..? తిరుమల లడ్డూ రేటు మారిపోయిందా..? ఏది నిజం..? ఏది అబద్ధం..?

Advertisement
Update: 2024-06-23 01:35 GMT

టీటీడీ ఈవో మారారు, మార్పులు చేయాలనుకుంటున్నారు -నిజం

నడక మార్గం దర్శన టోకెన్లకు స్కానింగ్ మొదలైంది -నిజం

రూ.300 రూపాయల దర్శనం టికెట్ ని రూ.200 చేశారు - అబద్ధం

లడ్డూ ప్రసాదం రేటు తగ్గించేశారు - అబద్ధం

టీటీడీకి కొత్త ఈవో వచ్చాక బయటకొస్తున్న సమాచారంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడంలేదు. కొందరు అత్యుత్సాహవంతులు ఈవోకంటే ముందుగా తమకు తామే కొత్త నిర్ణయాలు ప్రచారంలోకి తెస్తున్నారు. ఆమేరకు టీటీడీ ఆదేశాలు విడుదల చేసినట్టు వాట్సప్ లో పోస్టింగ్ లు పెడుతున్నారు. చాలామంది ఆ మార్పులు నిజమేననుకుంటున్నారు. ఆ మెసేజ్ లను ఫార్వార్డ్ చేస్తూ మరింత గందరగోళానికి దారి తీస్తున్నారు.

వాస్తవానికి మార్పులు జరిగితే టీటీడీ అధికారికంగా వాటిని ప్రకటిస్తుంది. ఆ ప్రకటనలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా బయటకు వస్తాయి. ఇప్పుడు వాట్సప్ యూనివర్శిటీలు, యూట్యూబ్ ప్రొఫెసర్లు ఎక్కువయ్యాక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడంలేదు. వ్యూస్ కోసం, లైకులు, షేర్లు, సబ్ స్క్రైబర్ల కోసం యథేచ్ఛగా తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ తప్పుడు సమాచారంతో గందరగోళం ఏర్పడటంతో టీటీడీ వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. స్పెషల్ దర్శనం, లడ్డూ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పింది. దర్శనం టికెట్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేసింది. 

Tags:    
Advertisement

Similar News