కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ.. టీటీడీ కీలక నిర్ణయాలివే

జనవరి 2 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సారి కూడా 10రోజులపాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. 10 రోజులకు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.

Advertisement
Update:2022-12-01 08:00 IST


కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు పెంచాలని పెద్దగా డిమాండ్ చేయరు. అర్థాంతరంగా తమ కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించొద్దని మాత్రమే వేడుకుంటారు. కాంట్రాక్ట్ పెంపు కోరుకునేవారికి టీటీడీ మరో మహత్తర అవకాశం కల్పించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకోసం ఓ కమిటీని నియమించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. బ్రహ్మోత్సవాల కానుకగా దీన్ని పేర్కొన్నారు. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జనవరి 2 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సారి కూడా 10రోజులపాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. 10 రోజులకు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున 10రోజులకు 2.5లక్షల రూ.300ల దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉంచుతారు. జనవరి 2న రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తేనే వారికి బ్రేక్‌ దర్శనం అవకాశం కల్పిస్తారు. ఆనంద నిలయం బంగారు తాపడం పనులకోసం ఫిబ్రవరి 23న బాలాలయం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం 331 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 1100 పైగా ఆలయాలను త్వరితగతిన నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కౌంటర్లలో భారీ అవకతవకలకు పాల్పడిన కేవీఎం సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బోర్డ్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

నిధుల కేటాయింపు ఇలా..

రెండో కనుమదారిలో రక్షణ గోడల నిర్మాణం, మరమ్మతులకోసం రూ.9కోట్లు

తిరుమల స్థానిక బాలాజీనగర్‌ లో డ్రైనేజీ పనులకు రూ.3.70 కోట్లు

జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న ఆలయ ఘాట్‌ రోడ్డు నిర్మాణం, అభివృధ్ధి పనులకు రూ.7కోట్లు

టీటీడీ ఆస్పత్రుల్లో మందులు, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు.

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు రూ.3.75 కోట్లు

కేటాయించారు.

Tags:    
Advertisement

Similar News