బాబు, పవన్ కి కంబైన్డ్ గా టీటీడీ చైర్మన్ హెచ్చరికలు

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ పలు తీర్మానాలను ఆమోదించింది. శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి టీటీడీ మీటింగ్ లో చర్చ జరిగింది.

Advertisement
Update:2023-06-19 16:32 IST

శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (SRIVANI) ట్రస్ట్ పై ఒకరోజు గ్యాప్ లో అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు ఇద్దరూ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రస్ట్ కి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. రశీదులు ఇవ్వడం లేదని, ట్రస్ట్ నిధులు ఎటు పోతున్నాయో తెలియడం లేదని నిందలు వేశారు. దీంతో వెంటనే టీటీడీ వివరణ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 2445 నూతన ఆలయాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ పలు తీర్మానాలను ఆమోదించింది. అందులో శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి చర్చ జరిగింది. ట్రస్ట్ నిధుల వినియోగంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానాన్ని టీటీడీ ఆమోదించింది. శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా దాదాపు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పూర్తయిందని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. నూతనంగా 2445 ఆలయాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. గోశాలల నిర్వహణ, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి నిధులు కేటాయిస్తున్నామన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసం టీటీడీపై దుష్ప్రాచారం చేయడం తగదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలనే తీర్మానాన్ని ఆమోదించారు.

టీటీడీ ఇతర నిర్ణయాలివి..

రూ.14 కోట్ల నిధులతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం.

రూ.1.28 లక్షల నిధులతో వసతి గృహాల ఆధునీకరణ.

రూ.7.44 కోట్లతో టీటీడీకి ఆధునిక కంప్యూటర్లు.

కొండపై వ్యర్థాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం, అందుకోసం కోసం రూ.40.50 కోట్లు కేటాయింపు.

తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్‌ ఆధునీకరణ.

శ్రీవెంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాల నిర్మాణం

రూ.9.5 కోట్లతో తిరుపతిలో అతిపెద్ద సెంట్రలైజ్డ్ గోడౌన్ నిర్మాణం.

రూ.6.65 లక్షలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్కరిని ఆధునీకరణకు ఆమోదం.

రూ.97 కోట్లతో స్విమ్స్‌ ఆస్పత్రి ఆధునీకరణ పనులకు ఆమోదం.

ఒంటిమిట్ట రామాలయంలో దాతల సాయంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం. 

Tags:    
Advertisement

Similar News