మళ్లీ మూడు రాజధానుల కదలిక - మూడో వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించే ఛాన్స్

ఇటీవల వాయిదా పడిన ఏపీ కేబినెట్ భేటీని ఈనెల 7న నిర్వహించనున్నారు. మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ ప్రధానంగా మూడు రాజధానుల బిల్లు అంశంపై జరగనుంది.

Advertisement
Update:2022-09-01 13:00 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం అని బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆయన అన్ని వేదికలపై నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు‌. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుని హైకోర్టు ఆక్షేపించింది. అమరావతిని రాజధానిని అభివృద్ధి చేయాలని గడువు కూడా ఇచ్చింది. కొన్నాళ్ళు మౌనంగా ఉన్న వైసీపీ సర్కారు మూడు రాజధానులకి మళ్లీ ముహూర్తం పెట్టింది. ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇటీవల వాయిదా పడిన ఏపీ కేబినెట్ భేటీని ఈనెల 7న నిర్వహించనున్నారు. మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ ప్రధానంగా మూడు రాజధానుల బిల్లు అంశంపై జరగనుంది. అనంతరం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యం అయిన మూడు రాజధానుల అంశం ప్రధానంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News