జగన్‌ పాలనలో మారిన ప‌ల్లెల‌ ముఖచిత్రం

నిజానికి, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. 15,004 గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా 540 ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు.

Advertisement
Update:2024-01-24 12:48 IST

గత నాలుగున్నరేళ్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రమే మారిపోయింది. గ్రామాల్లో ఫీల్‌ గుడ్‌ వాతావరణం ఏర్పడింది. ప్రజలు కనీస సౌకర్యాల కోసం వెంపర్లాడని పరిస్థితి ఏర్పడింది. ఇంటి ముంగిట కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు, సౌకర్యాలకు సంబంధించిన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గ్రామాలు సంపదకు, ప్రగతికి ముఖద్వారాలుగా మారాయి. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం గ్రామాలను ఎకనమిక్‌ హబ్‌గా మార్చే ప్రక్రియను చేపట్టింది. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. గ్రామాలు నేడు మునుపెన్నడూ లేని విధంగా సజీవంగా మారాయి. గ్రామాలు వెలిగిపోతున్నాయి.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ల వల్ల ప్రజల జీవనం సాఫీగా సాగిపోతున్నది. ఫెసిలిటీ సెంటర్ల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాలు రైతుల కష్టాలను తీర్చాయి. రైతులు విత్తనాల కోసం గానీ, తమ పంటల విక్రయానికి గానీ, మరోచోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలు ఒకేచోట లభిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల విధానం రిజర్వ్‌ బ్యాంక్‌, నాబార్డు, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకున్నాయి. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించిన ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఆశ్చర్యచకితులయ్యారు

నిజానికి, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. 15,004 గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా 540 ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక చర్య. గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం లక్షా 35 వేల 819 పర్మినెంట్‌ ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది. దానికి తోడు 2.6 లక్షల వాలంటీర్లను నియమించి యువతకు ఉపాధి కల్పించింది. ఈ ఉద్యోగాల్లో స్థానిక యువతకే అవకాశం కల్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామాలు ఇంతగా మార్పు చెందడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన మరో విప్లవాత్మకమైన పథకం గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు (విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు). గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి జగన్‌ ప్రభుత్వం 10,132 హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో సెంటర్‌ 2,500 మంది ఆరోగ్యావసరాలను తీరుస్తుంది. ఈ కేంద్రాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రజలకు 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు తమ ఇంటి వద్దనే ఆరోగ్య సౌకర్యాలు కల్పించడంలో అత్యంత విప్లవాత్మకమైంది ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.

రాష్ట్రంలోని 56,703 విద్యాసంస్థలను ఆధునీకీకరించడానికి, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి జగన్ ప్ర‌భుత్వం 17,805 రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ కార్యక్రమం మూడు దశల్లో పూర్తవుతుంది. పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న ప్రజల కోసం జగన్‌ ప్రభుత్వం ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నది. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అందిస్తున్నది.

మొత్తంగా, జగన్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వాతావరణమే మారిపోయింది. ఆర్థిక కష్టాలనే కాకుండా ఆరోగ్య సౌకర్యాల కొరత నుంచి పూర్తిగా గ్రామాలు బయటపడ్డాయి. ప్రజలకు ఆరోగ్యం, విద్య అందుబాటులోకి వస్తే భవిష్యత్తరాలు ప్రగతిపథంలోకి దూసుకెళ్తాయి.

Tags:    
Advertisement

Similar News