కోత కాదు.. ఏపీలో భారీగా పెరిగిన పింఛన్ల సంఖ్య

పింఛన్ల కోతలో వాస్తవం లేదని తేలింది. ఇప్పటి వరకు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. జనవరి 1వ తేదీ అదనంగా మరో 2లక్షల 31వేల పింఛన్లను ఇవ్వబోతున్నారు.

Advertisement
Update:2022-12-31 16:52 IST

ఏపీ ప్రభుత్వం భారీగా పింఛ‌న్లు తొలగిస్తోంది అంటూ ప్రతిపక్షాలు, మీడియా పెద్ద ఎత్తున ఇటీవల విమర్శలు చేస్తున్నాయి. లక్షా 60వేల మందికి నోటీసులు ఇచ్చారని మీడియాలో ప్రచారం జరిగింది. నోటీసులు ఇచ్చింది నిజమేగానీ.. వివరణ తీసుకోకుండా పింఛన్ల తొలగింపు ఉండదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇది రోటీన్ వెరిఫికేషనే అని చెప్పింది. అర్హులని తేలితే పింఛన్ కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పినా విపక్షాలు లెక్క చేయలేదు.

అయితే పింఛన్ల కోతలో వాస్తవం లేదని తేలింది. ఇప్పటి వరకు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. జనవరి 1వ తేదీ అదనంగా మరో 2లక్షల 31వేల పింఛన్లను ఇవ్వబోతున్నారు. దాంతో ఏపీలో పింఛన్‌దారుల సంఖ్య 64 లక్షలు దాటేసింది. జనవరి ఒకటి నుంచి పింఛన్ల పంపిణీ వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 2500 ఇస్తున్నారు. ఇకపై 2750 రూపాయలను ఇస్తారు. జనవరి 3న రాజమండ్రిలో జరిగే పింఛన్ పంపిణీ వారోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు.

Tags:    
Advertisement

Similar News