వచ్చే ఏడాది ప్రారంభానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి

అసెంబ్లీ సమావేశాల్లో తెలిపిన మంత్రి నారా లోకేశ్‌

Advertisement
Update:2024-11-15 11:56 IST

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు సున్నా అని విమర్శించారు. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. టీచర్లపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. టీడీపీ హయాంలో మొత్తం 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లను భాగస్వామ్యం చేస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News