రాష్ట్రాభివృద్ధికి నిపుణుల, అనుభవజ్ఞుల సలహాలు కావాలి

కాలుష్యం పెరుగుతుండటంతో ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తున్నదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

Advertisement
Update:2024-10-09 12:42 IST

కాలుష్య నివారణకు ప్రణాళికలు అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏ పని అయినా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమన్నారు. పర్యావరణం బాగుండాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకరినని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరి సలహాలు సూచనలు అవసరమని పేర్కొన్నారు. సరైన నిర్ణయంతోనే మంచి పలితాలు వస్తాయని పవన్‌ చెప్పారు. నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరం అన్నారు. మేం చెప్పడానికి కాదు. వినేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తున్నదని, కాలుష్యం పెరుగుతున్నదని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

కుమార్తెతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్‌

అంతకుముందు పవన్‌ కల్యాణ్‌ ఆయన కుమార్తె ఆద్యతో కలిసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్‌తోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మరో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొన్నది.

Tags:    
Advertisement

Similar News