తాకట్టులో సచివాలయం.. పూర్తిగా అవాస్తవం - APCRDA

APCRDA భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణాలు పొందలేదని..ఇలాంటి తప్పుడు, నిరాధారమైన వార్తను ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Advertisement
Update:2024-03-04 08:34 IST
తాకట్టులో సచివాలయం.. పూర్తిగా అవాస్తవం - APCRDA
  • whatsapp icon

తాకట్టులో సచివాలయం అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకొచ్చింది. రూ.370 కోట్ల కోసం సచివాలయంను HDFCకి జగన్‌ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వండి వార్చింది. అయితే తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ- APCRDA క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా సత్యదూరం అని చెప్పింది APCRDA. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఇటువంటి ప్రతిపాదన ఏది తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు HDFCకి తాకట్టు పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పింది APCRDA. ICICI, HDFC బ్యాంకుల నుంచి APCRDA ఎలాంటి రుణాలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఆ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి. శ్రీనివాస రావు.

రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్‌ 32 ప్రకారం 2018లో కన్సార్టియం బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు రూ. 2060 కోట్లు మంజూరు చేశాయని.. అందులో కేవలం రూ. 1955 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేయడం జరిగిందని ప్రకటనలో చెప్పారు. 2017 సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోరకు హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని..అందులో నుంచి రూ.1151 కోట్లు మాత్రమే CRDAకు రిలీజ్ అయిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ కూడా జారీ చేసిందని ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు అధికారులు

APCRDA భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణాలు పొందలేదని..ఇలాంటి తప్పుడు, నిరాధారమైన వార్తను ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News