ఇందుకే ఎల్లోమీడియా అని ముద్రపడిందా..?

నిజానికి జరిగింది జరిగినట్లు రిపోర్టు చేయాలంటే అమరావతి జేఏసీకి కోర్టులో చుక్కెదురని, షాక్‌ అనో రాయాల్సుంటంది. అలారాయటం ఇష్టంలేకపోతే అసలు విషయాన్ని పూర్తిగా వదిలేయాలి.

Advertisement
Update:2022-11-02 11:03 IST

జగన్మోహన్‌ రెడ్డిని వ్యతిరేకిస్తున్న మీడియాకు జనాల్లో ఎల్లోమీడియా అనే ముద్రపడిపోయింది. ఈ ముద్ర ఇప్పటిది కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలోనే పడినా ఇప్పుడు జనాలు ఆ ముద్రను అంగీకరించారు. దీనికి తాజా ఉదాహరణ కనబడుతోంది. అమరావతి జేఏసీ పాదయాత్ర విషయమై కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ఎల్లోమీడియా తనకు అనుకూలంగా బ్యానర్‌ కథనాలుగా హైలైట్‌ చేసింది. 50 రోజుల క్రితం పాదయాత్రలో ఉన్న వాళ్ళ గుర్తింపుకార్డులను పోలీసులు తనిఖీచేశారు.

ఎప్పుడైతే గుర్తింపుకార్డుల తనిఖీ మొదలైందో వెంటనే పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్ళలో అత్యధికులు పారిపోయారు. దాంతో పాదయాత్రంతా బోగస్‌ అని తేలిపోవటంతో చేసేదిలేక యాత్రకు జేఏసీ బ్రేక్‌ ఇచ్చింది. తర్వాత కోర్టులో పిటీషన్‌ వేసింది. పాదయాత్ర విషయంలో సింగిల్‌ బెంచ్‌ జడ్జి విధించిన ఆంక్షలను ఎత్తేయాలని జేఏసీ కేసువేసింది కాబట్టి కోర్టు పోలీసులకు నోటీసులిచ్చింది. సరే రెండువైపుల వాదనలు విన్న కోర్టు ఆంక్షలను ఎత్తేయలేమని స్పష్టంగా చెప్పింది. సింగిల్‌ బెంచ్‌ విధించిన ఆంక్షలు సరైనవేనని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు సూచించింది.

వాస్తవం ఇలాగుంటే 'పాదయాత్రను ఆపలేం' అని కోర్టు పోలీసులకు స్పష్టం చేసినట్లు బ్యానర్‌ పెట్టారు. బ్యానర్‌ చదివితే పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారని, దాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ కోర్టులో కేసు వేస్తే పోలీసులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నట్లుగా ఉంది. నిజానికి కోర్టులో కేసువేసింది జేఏసీ. సింగిల్‌ బెంచ్‌ విధించిన ఆంక్షలను ఎత్తేయాలని జేఏసీ కేసువేస్తే ఆ కేసును కోర్టు కొట్టేసింది.

నిజానికి జరిగింది జరిగినట్లు రిపోర్టు చేయాలంటే అమరావతి జేఏసీకి కోర్టులో చుక్కెదురని, షాక్‌ అనో రాయాల్సుంటంది. అలారాయటం ఇష్టంలేకపోతే అసలు విషయాన్ని పూర్తిగా వదిలేయాలి. అయితే కోర్టు తీర్పొకటైతే ఎల్లోమీడియా రాసింది మరొకటి. ఇందుకనే ఎల్లోమీడియాకు జనాల్లో విశ్వసనీయత పోయింది. ప్రభుత్వంలో తప్పులుంటే కచ్చితంగా రాయాల్సిందే. కానీ లేనిది ఉన్నట్లు రాస్తుండటం వల్లే సమస్యలొస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా వంద అబద్ధాలు రాసి మధ్యలో ఒక నిజంరాసినా జనాలు పట్టించుకోవటం మానేశారు. ఈ కారణంగానే జగన్‌ వ్యతిరేక మీడియాకు ఎల్లోమీడియా అనే ముద్ర స్థిరపడిపోయింది.

Tags:    
Advertisement

Similar News