కూటమికి గ్లాసు గండం.. ఆ 20 స్థానాల్లో ఇండిపెండెంట్లకు కేటాయింపు!
కేవలం విజయనగరమే కాదు.. మదనపల్లి, శృంగవరపుకోట, జగ్గయ్యపేట, మైదుకూరు, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుల గుర్తును కూడా కేటాయించారు. మొత్తంగా 20కి పైగా స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు సమాచారం.
ఏపీ ఎన్నికల్లో కొంతమంది ఇండిపెండెంట్లకు గ్లాసు సింబల్‌ను కేటాయించడం.. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమికి తలనొప్పిగా మారింది. గాజు గ్లాసు సింబల్‌ను ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించినప్పటికీ.. అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉండిపోయింది. దీంతో జనసేన అభ్యర్థి పోటీలో లేని నియోజకవర్గాల్లో కొంతమంది స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్‌ను కేటాయించడం కూటమిని టెన్షన్ పెడుతోంది.
విజయనగరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతి రాజు పోటీ చేస్తున్నారు. ఐతే మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో ఓట్లు చీలి కూటమికి నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కేవలం విజయనగరమే కాదు.. మదనపల్లి, శృంగవరపుకోట, జగ్గయ్యపేట, మైదుకూరు, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుల గుర్తును కూడా కేటాయించారు. మొత్తంగా 20కి పైగా స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు సమాచారం.
గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు వీళ్లే -
1. విజయనగరం - మీసాల గీత (టీడీపీ రెబల్)
2. మైలవరం - వల్లభనేని నాగపవన్
3.విజయవాడ సెంట్రల్ - గొల్లపల్లి ఫణిరాజ్
4. టెక్కలి - అట్టాడ రాజేష్
5. కాకినాడ - పాఠంశెట్టి సూర్యచంద్ర
6. కావలి - సుధాకర్ (టీడీపీ రెబల్)
7. పెదకూరపాడు - నంబూరు కల్యాణ్ బాబు
8. గన్నవరం - వల్లభనేని వంశీమోహనకృష్ణ (ఇండిపెండెంట్)
9. మంగళగిరి - రావు సుబ్రహ్మణ్యం
10. మదనపల్లె - షాజహాన్
11. శృంగవరపు కోట - కొట్యాడ లోకాభిరామకోటి (జనసేన రెబల్)
12. అనకాపల్లి ఎంపీ - వడ్లమూరి స్వరూప
13. విజయవాడ ఎంపీ - యనమండ్ర కృష్ణ కిషోర్
14. రాప్తాడు -
15. చంద్రగిరి -
16. కమలాపురం -
17. మచిలీపట్నం -
18. మైదుకూరు -
19. జగ్గయ్యపేట -
20. జగ్గంపేట -