జగన్‌ను టీ నేతలతో తిట్టిస్తోందా?

జ‌గ‌న్ విష‌యంలో ఎల్లో మీడియా యాజమాన్యం రూటు మార్చింది. తెలంగాణ నేతలతో తిట్టించటం మొదలుపెట్టింది. సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిపిన ఇంట‌ర్వ్యూలో జగన్‌కు వ్యతిరేకంగానే మాట్లాడించింది.

Advertisement
Update:2023-07-17 11:51 IST

ఏపీలో జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే జనాలు నమ్మటంలేదని అనుకున్నారో ఏమో. అందుకనే ఎల్లో మీడియా యాజమాన్యం రూటు మార్చి తెలంగాణ నేతలతో తిట్టించటం మొదలుపెట్టింది. సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిపిన ఇంట‌ర్వ్యూలో జగన్‌కు వ్యతిరేకంగానే మాట్లాడించారు. కడియం మాట్లాడుతూ.. ఆంధ్రా ఆగమైపోయిందన్నారు. ఏపీ పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు. అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోందట.

క్విడ్ ప్రో కో కింద వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ పేదల గురించి మాట్లాడటం ఏమిటన్నారు. ఏపీలో ఫుల్లుగా కుల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అక్రమార్జనపై సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్ అవినీతి గురించి మాట్లాడటం ఏమిటని సెటైర్లు వేశారు. జగన్ ఆస్తులను జప్తు చేసింది నిజం కాదా అని నిలదీశారు. దేశంలోనే రిచ్చెస్ట్ సిఎం అయిన జగన్ పేదలు -పెత్తందార్ల మ‌ధ్య‌ యుద్ధం అని చెబుతుంటే నవ్వొస్తోందన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ పాలనకు కడియం సర్టిఫికెట్ అవసరంలేదు. ఆంధ్రా ఆగమైపోతోందన్న కడియం ఎక్కడ ఆగమవుతోందో చెబితే బాగుండేది. ఏపీ ఎక్కడ ఆగమైపోతోందంటే ఎల్లో మీడియా రాతల్లో, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ప్రతిపక్షాల ఆరోపణల్లో మాత్రమే. ఇక జగన్ మీద కేసులను విచారిస్తున్న సీబీఐ, ఈడీ ఒక్క కేసును కూడా ఇప్పటివరకు నిరూపించలేకపోయాయి. అసలు జగన్ మీద కేసులు ఎలా నమోదయ్యాయో కూడా అందరికీ తెలుసు. అందుకనే జనాలు వాటిని పట్టించుకోకుండా 2019లో 151 సీట్లిచ్చారు.

ఇక కడియం అవినీతి గురించి మూడు రోజుల క్రితమే మాజీ మంత్రి తాటిపర్తి రాజయ్య మాట్లాడారు. కడియంను అవినీతి అనకొండ అంటూ ఆరోపించారు. కడియం వేల కోట్ల రూపాయల సంపాదనకు తన వ‌ద్ద‌ ఆధారాలున్నాయని రాజయ్య చెప్పిన విషయం అందరు చూసిందే. జగన్‌ను రిచ్చెస్ట్ సీఎం అని కడియం చెప్పింది తప్పు. ఎందుకంటే జగన్ 2019 ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా రెచ్చెస్ట్ సీఎం అంటున్నారు. అప్పటికి జగన్ ప్రతిపక్ష నేత మాత్రమే.

ప్రతిపక్ష నేతగా జగన్ తన అఫిడవిట్లో రూ. 580 కోట్ల ఆస్తులు చూపించారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు తన ఆస్తులను రూ. 610 కోట్లుగా చూపించారు. మరి ఇద్దరిలో రిచ్చెస్ట్ ఎవరు? ఏపీలో కుల రాజకీయాలు పెరిగిపోయాయంటున్న కడియం తెలంగాణ సంగతిని మరచిపోతే ఎలా? మొత్తానికి తెలంగాణ నేతలతో కూడా జగన్‌ను ఎల్లో మీడియా తిట్టించటం మొదలుపెట్టిందని అర్థ‌మవుతోంది.

Tags:    
Advertisement

Similar News