'ఫేస్ రిక‌గ్నైజేష‌న్‌' అటెండెన్స్‌కి టీచ‌ర్లు ఓకే

చ‌ర్చ‌ల అనంత‌రం ఎస్.టి.యూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ టీచ‌ర్ల ఫోన్లల్లోనే యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించామ‌ని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రికి వివరించ‌గా సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు.

Advertisement
Update:2022-09-01 19:48 IST

ముఖ ఆధారిత యాప్ తమ ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకారం తెలిపారు. గ‌త కొద్దిరోజులుగా దీనిపై పెద్ద ఎత్తుల ఉద్య‌మం సాగిస్తున్న ఉపాధ్యాయుల త‌ర‌ఫు సంఘాల‌ ప్ర‌తినిధుల‌తో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చ‌ర్చించారు. అనంత‌రం తాము ఫేస్ రిక‌గ్నైజేష‌న్ యాప్‌ని త‌మ ఫోన్ల‌లోనే డౌన్‌లోడ్ చేసుకుంటామ‌ని అంగీకారం తెలిపిన‌ట్లు టీచ‌ర్స్ యూనియ‌న్‌ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. యాప్ లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల గడువు కూడా ఇచ్చారు.

చ‌ర్చ‌ల అనంత‌రం ఎస్.టి.యూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ టీచ‌ర్ల ఫోన్లల్లోనే యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించామ‌ని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రికి వివరించ‌గా సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. ఫేస్ రిక‌గ్నైజేష‌న్‌ యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామ‌ని, సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాల‌ని మంత్రికి వివ‌రించామ‌న్నారు. టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్లోడింగులో ప్రాబ్లం ఉంటే.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పార‌ని ఎస్టీయూ నేత వివ‌రించారు.

Tags:    
Advertisement

Similar News