మళ్ళీ జూనియర్‌పై దాడి మొదలు పెట్టిన టీడీపీ

టీడీపీ శ్రేణుల్లో జూనియర్‌ను అల్లరిపట్టించాలనేది మాత్రమే వ్యూహంగా కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ను జూ.ఎన్టీఆర్‌ బూతులు తిడుతూ ట్వీట్ చేయలేదు కాబట్టి ఆయనకు తాత మీద ప్రేమ లేదు అని చాటే ప్రయత్నం మీడియా చేస్తోంది.

Advertisement
Update:2022-09-23 10:55 IST

మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ టార్గెట్ అయ్యారు. వర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని తప్పుపడుతూ జూ.ఎన్టీఆర్‌ కూడా ట్వీట్ చేశారు. కానీ అది సరిపోదంటోంది చంద్రబాబు మీడియా. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ కలిగిన గొప్పనాయకులే అంటూ తన ట్వీట్‌లో జూ.ఎన్టీఆర్ అనడాన్ని జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ.

జూనియర్ ఎన్టీఆర్‌పై హేతువాది బాబు గోగినేని కూడా ఆగ్రహించడం ఇక్కడ చర్చనీయాంశం. జూనియర్‌ ఎన్టీఆర్‌ను జూ. వైఎస్‌ఆర్‌ అని ఆయన అభివర్ణించారు. జూ.ఎన్టీఆర్ గుడివాడ- నాగపూర్ మధ్య ఊగిసలాడుతున్నారని విమర్శించారు. అసలు జూ.ఎన్టీఆర్ ట్వీట్‌లో తప్పేంటి ?.. చనిపోయిన నేతలను గౌరవించడం తెలియదా అని ఒకవైపు జగన్‌ను చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.. జూ.ఎన్టీఆర్‌ మాత్రం చనిపోయిన వైఎస్‌ఆర్‌ పట్ల హుందాగా ఒక వ్యాఖ్య చేయగానే ఆయనపై టీడీపీ వారు విరుచుకుపడుతున్నారు.

టీడీపీ శ్రేణుల్లో జూనియర్‌ను అల్లరిపట్టించాలనేది మాత్రమే వ్యూహంగా కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ను జూ.ఎన్టీఆర్‌ బూతులు తిడుతూ ట్వీట్ చేయలేదు కాబట్టి ఆయనకు తాత మీద ప్రేమ లేదు అని చాటే ప్రయత్నం మీడియా చేస్తోంది.. జూ.ఎన్టీఆర్ గోడమీద పిల్లి అని, తాతకు మనవడు వెన్నుపోటు అని హెడ్‌లైన్లు పెట్టేస్తున్నారు.

గతంలో హరికృష్ణకు, జూ.ఎన్టీఆర్‌కు వైసీపీతో సంబంధాలు అంటగట్టేందుకు, ఒకదశలో హరికృష్ణ వైసీపీలో చేరుతారని ప్రచారం చేసే వరకు బాబు మీడియా తెగించింది. తీరా మొన్న అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలవగానే.. ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాత స్థాపించిన పార్టీకి నష్టం చేయరు, బీజేపీలో చేరరు అంటూ మాట్లాడింది.

ఇప్పుడు మరోసారి జగన్‌పై జూ.ఎన్టీఆర్ విరుచుకుపడలేదు, తాతకు వెన్నుపోటు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. జూ.ఎన్టీఆర్‌ ట్వీట్‌తో సరిపెట్టారు సరే.. మరి ఎన్టీఆర్ కుమారులంతా రోడ్డు మీదకు రాలేదే.. వాళ్లు కూడా ట్వీట్లు, వీడియోలు మాత్రమే వదులుతున్నారే. వారిది తప్పు కానప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రమే ఎందుకు టీడీపీ మీడియాకు టార్గెట్ అవుతున్నారు?. కారణం ఒకటే జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ శ్రేణుల్లో డ్యామేజ్ చేయాలి. బాబు వారసత్వానికి తిరుగు లేకుండా చేయాలి. పేరు మార్పు అంశంపైనా మరో అమరావతి ఉద్యమంలా, కొంపలు మునిగినట్టు మరీ ఓవర్ చేయడం కూడా బాగోలేదు.

Tags:    
Advertisement

Similar News