టీడీపీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌

టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు.

Advertisement
Update:2024-12-18 12:48 IST

తెలుగు దేశం పార్టీ యూట్యూబ్ ఛానల్‌ హ్యాక్‌కు గురైంది. నిన్న రాత్రి నుంచి టీడీపీ యూట్యూబ్ ఛానల్‌ పనిచేయడం లేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది తెలిపారు. పార్టీ యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేయడంతో ఈరోజు ఉదయం నుంచి అందులో ప్రసారాలు ఆగిపోయాయి. టీడీపీ యూట్యూబ్ ఛానల్‌లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్‌మీట్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలు, కార్యక్రమాలు, ఆయన మాట్లాడుతున్న లైవ్‌లు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రసారం చేస్తారు.

టీడీపీ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీకి చెందిన ముఖ్యనేతలు యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అవుతుంటారు. ఈరోజు ఉదయం యూట్యూబ్‌ ఛానల్‌ను ఆన్ చేయగా ‘‘ద పేజ్ ఈజ్ నాట్ అవేలబుల్’’ అనే మెసేజ్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.

Tags:    
Advertisement

Similar News