బెడిసికొట్టిన కుప్పం డ్రామా ..

కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ ఈ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి.

Advertisement
Update:2022-08-30 18:25 IST

కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ ఈ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. అన్న క్యాంటిన్ తో పాటు.. చంద్రబాబు ఫ్లెక్సీని కూడా దుండగులు తొలగించారని కూడా వార్తల్లో పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, మరికొందరు నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ విషయంపై విమర్శించారు. ఎందుకు అన్న క్యాంటిన్ కూల్చివేశారంటూ ప్రశ్నించారు.

ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలను అంతా నమ్మారు.

ఈ విషయంపై తాజాగా కుప్పం మున్సిపాలిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. 'కుప్పం బస్టాండ్ సమీపంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓ తాత్కాలిక నిర్మాణంలో అన్న క్యాంటిన్ ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. అయితే కేవలం టెంట్లు, షామియానాతో తాత్కాలికంగా దాన్ని నిర్మించారు. గత రెండు మూడు రోజులుగా కుప్పంలో భారీ వర్షం కురుస్తోంది.

ఈదురు గాలులు, వర్షాలకు ఈ తాత్కాలిక నిర్మాణం పాక్షికంగా కుప్పకూలింది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ అధికారులే ఆ టెంటును మొత్తంగా కూల్చేశారు. అనవసరంగా కొన్ని పత్రికలు, వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేశాయి.' అంటూ కుప్పం మున్సిపల్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News