కాల్ మ‌నీ, బెట్టింగ్ కింగ్, టీడీపీ నేత‌ క‌ర్నాటి రాంబాబుని దుర్గ‌గుడి చైర్మ‌న్ చేసిన వైసీపీ

విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ రాకెట్ న‌డిపించే టిడిపి నేత‌ల‌పై పెద్ద ఉద్య‌మ‌మే చేసిన వైసీపీ చివ‌రికి టిడిపి నుంచి వైసీపీలో చేరిన కాల్ మ‌నీ బిగ్ షాట్ అయిన క‌ర్నాటి రాంబాబుని ఎంతో ప‌విత్ర‌మైన దుర్గ‌గుడి ఆల‌య ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్‌గా నియ‌మించ‌డంపై విజ‌య‌వాడ ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Update:2023-02-08 16:38 IST

తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు విప‌క్ష వైసీపీ పోరాటాల‌కు కాల్ మ‌నీ సెక్స్ రాకెట్ ఓ ఆయుధం. కాల్ మ‌నీ ఆరోప‌ణ‌ల‌తో టిడిపికి బాగా డ్యామేజ్ అయ్యింది. తీసుకున్న అసలు వడ్డీతో స‌హా కలిపి మరుసటి రోజు తీర్చేయాలి. అలా తీర్చ‌లేక‌పోతే అరాచ‌కాలే. తీసుకున్న అప్పుకు రోజుకు నూటికి 10 రూపాయల వడ్డీ వసూలు చేసేవాళ్లు. అప్పుతీర్చ‌లేని వారి ఇంటి మ‌హిళ‌ల‌ని లైంగికంగా వేధించ‌డంతో ఈ రాకెట్ అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. నెల‌ల త‌ర‌బ‌డి వార్త‌ల్లో న‌లిగి, అసెంబ్లీలో చ‌ర్చ‌కి దారితీసింది.

కాల్ మ‌నీ రాష్ట్ర‌వ్యాప్తంగా వేళ్లూనుకున్నా విజయవాడకు చెందిన కొందరు యువతుల, గృహిణుల మానప్రాణాలతో కాల్‌మ‌నీ వ్యాపారులు బేరాలు చేయ‌డంతో చర్చనీయాంశమైంది. ప్ర‌తిప‌క్షం, ప్ర‌జాసంఘాల ఆందోళ‌న‌తో నాటి టిడిపి ప్ర‌భుత్వం కాల్‌మ‌నీ వ్యాపారుల‌పై చ‌ర్య‌ల‌కు దిగింది. విజయవాడలో ఈ కేసులలో చిక్కుకున్నవారిలో టిడిపి నేత‌లు ఉన్నార‌ని వైసీపీ ఆరోపించింది. కాల్ మ‌నీ వ్యాపారుల‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన టిడిపియే వారి ఆగ‌డాల‌కు బాధ్యుల‌ని పేర్కొంది.

2019లో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. కాల్ మ‌నీ గుట్టుగా సాగుతున్న పెద్ద‌గా బ‌య‌ట‌కొచ్చేంత అరాచ‌కాలు ఏమీ న‌మోదు కాలేదు. అయితే ఏ కాల్ మ‌నీ వ్యాపారుల‌కు తెలుగుదేశం ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింద‌ని ఆరోప‌ణ‌లు చేసిందో వైసీపీ, అదే కాల్ మ‌నీ వ్యాపారిని ఏకంగా దుర్గ గుడి ఆల‌య పాల‌క మండ‌లి చైర్మ‌న్‌ని చేసేసింది. క‌ర్నాటి రాంబాబు టిడిపిలో ఉండేవారు. కాల్ మ‌నీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కేసులు కూడా న‌మోదు అయ్యాయి. వైసీపీలో చేరి మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు వ‌ర్గంలో చేరారు. ఇప్పుడు ఆల‌య చైర్మ‌న్ కూడా అయిపోయారు.

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. పాలకమండలి సభ్యులుగా 14 మంది ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ రాకెట్ న‌డిపించే టిడిపి నేత‌ల‌పై పెద్ద ఉద్య‌మ‌మే చేసిన వైసీపీ చివ‌రికి టిడిపి నుంచి వైసీపీలో చేరిన కాల్ మ‌నీ బిగ్ షాట్ అయిన క‌ర్నాటి రాంబాబుని ఎంతో ప‌విత్ర‌మైన దుర్గ‌గుడి ఆల‌య ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్‌గా నియ‌మించ‌డంపై విజ‌య‌వాడ ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కాల్ మ‌నీ కేసులున్న వ్య‌క్తికి కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన వైసీపీ స‌ర్కారు, ఇక‌పై టిడిపిని కాల్ మ‌నీ ఆరోప‌ణ‌లు ఎలా చేయ‌గ‌ల‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. విజయవాడ చిట్టినగర్‌ 47వ డివిజన్‌కు చెందిన కర్నాటి రాంబాబుపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉండేది. కొన్నాళ్ల క్రితం దీన్ని తీయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాల్ మ‌నీ ఆరోప‌ణ‌లు, కేసులు చుట్టుముట్టాయి. వైఎస్ జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే టిడిపి నుంచి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అనుంగు అనుచ‌రుడిగా రాంబాబు మారిపోయారు. కాల్‌మనీ, క్రికెట్‌ బెట్టింగ్‌ ఆరోపణలు ఉన్న రాంబాబుని అత్యంత ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్‌గా వైసీపీ ప్ర‌భుత్వం నియ‌మించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News