50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ ఓటములు..ఇంత అన్యాయమా?

2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 50 నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ చేతిలో కూడా ఓడిపోయారు.

Advertisement
Update:2023-05-07 12:14 IST

పార్టీలైనా, వ్యక్తులైనా వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. కానీ టీడీపీ మాత్రం మూడు వరుస ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను రికార్డు చేసింది. 50 నియోజకవర్గాల్లో టీడీపీని వరుస ఓటములే పలకరిస్తున్నాయి. అభ్యర్థులను మార్చినా, ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా గెలుపు అయితే టీడీపీకి దక్కటంలేదు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 50 నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ చేతిలో కూడా ఓడిపోయారు.

ఈ 50 నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జీడీ నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో చంద్రగిరిలో 1999 తర్వాత టీడీపీ గెలిచిందే లేదు. ఇక జగన్ సొంత జిల్లా కడపలో అయితే బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, రాజాం, పాలకొండ, విజయనగరం జిల్లాలోని సాలూరు, కురుపాం, బొబ్బిలి, విశాఖ జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, తూర్పుగోదావరిలోని తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్తపేట ఉన్నాయి.

పశ్చిమ గోదావరిలో తాడేపల్లిగూడెంలో కూడా టీడీపీ గెలవలేదు. ఇక కృష్ణా జిల్లాలో తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, గుంటూరులో మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, నెల్లూరు సిటి, రూరల్, సర్వేపల్లి, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్ళగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, ఆలూరు ఉన్నాయి.

ఇదే సందర్భంగా టీడీపీ వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచింది ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే. అవేమిటంటే కుప్పం, హిందుపురం, గన్నవరం, ఉండి, రాజమండ్రి రూరల్, మండపేట, విశాఖ ఈస్ట్, ఇచ్చాపురం మాత్రమే. అంటే ఇలాంటి లెక్కలు చాలా వేసుకున్న తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో జగన్ వైనాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్నట్లున్నారు. టార్గెట్ పెట్టుకోవటం జగన్ చేతిలోని పనే. కానీ అందుకు ఓటర్లు సానుకూలంగా సహకరించాలి కదా. చూద్దాం ఏమవుతుందో.

Tags:    
Advertisement

Similar News