ఈ గెలుపు అభ్యర్థిదా? పార్టీదా..? - ఎవరీ వేపాడ చిరంజీవి రావు..

తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోతుందీ అనుకుంటున్న తరుణంలో ఈ ఎన్నిక‌లు ఊపిరిలూదాయి. మరి ఇప్పటికైనా వైసీపీ అలర్ట్ అవుతుందా..? ఓటమిని విశ్లేషించుకుంటుందా..? అన్నది వేచి చూడాలి.

Advertisement
Update:2023-03-18 18:26 IST

ఇక టీడీపీకి భవిష్యత్ లేదు.. రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాల్సిందే.. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది.. లోకేశ్ లో అంత సామర్థ్యం కనిపించడం లేదు. అనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి అనూహ్య విజయం దక్కింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ విజయాన్ని ఊహించాడో.. లేదో.. తెలియదు గానీ.. సడెన్ గా ఉత్తరాంధ్ర‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.

అయితే ఉత్తరాంధ్ర అభ్యర్థి వేపాడ చిరంజీవి మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించారు. ఇక్కడ టీడీపీ గెలుపునకు వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓ కారణమైతే.. తెలుగుదేశం పార్టీకి.. అభ్యర్థి చాలా ప్లస్ గా మారాడన్న వాదన వినిపిస్తోంది. నిజానికి వేపాడ చిరంజీవి రావు.. తెలుగుదేశం నేత కంటే ఎకానమీ మాస్టార్ గా ఎంతో ప్రసిద్ధుడు. ఎందరో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న అభ్యర్థులు.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులైతే .. మరికొందరు వివిధ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. వీరంతా తమ మాస్టార్ కోసం శ్రమించారు.

ఇక్కడ పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకత కంటే.. చిరంజీవి రావు మీదున్న అభిమానం గెలిపించిందని చర్చ జరుగుతోంది. మొత్తంగా చిరంజీవి రావు లాంటి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం టీడీపీ తొలి విజయమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోతుందీ అనుకుంటున్న తరుణంలో ఈ ఎన్నిక‌లు ఊపిరిలూదాయి. మరి ఇప్పటికైనా వైసీపీ అలర్ట్ అవుతుందా..? ఓటమిని విశ్లేషించుకుంటుందా..? అన్నది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News