తిరుపతిలో తొక్కిసలాట: అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

Advertisement
Update:2025-01-09 14:41 IST

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తుల రద్దీ పెరగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అంబులెన్స్‌ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News