శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐతో విచారణ జరిపించాలి : షర్మిల

ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీవారికి పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-09-21 03:47 IST

శ్రీవారి లడ్డూ తయారీలో బిఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వాడటం చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిపారు. తిరుపతి లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారు చేసి కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఎందుకు తీసుకులేదని ఆమె ప్రశ్నించారు. మీకు ముందుగానే తెలిస్తే ఎందుకు లేట్‌గా చెప్పారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడానికే లడ్డూల స్కామ్ గురించి మాట్లారా అని ప్రశ్నించారు.

తిరుమల లడ్డూల అంశంపై సీబీఐ చేత ఎంక్వరీ చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ఆ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News