టీడీపీకి షాక్.. రాయచోటిలో మూకుమ్మడి రాజీనామాలు
యోజకవర్గంలోని 11 మంది క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, ఆరుగురు పీఎంపీలు, 20 మంది ITDP సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. రాయచోటి టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.
రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని 11 మంది క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, ఆరుగురు పీఎంపీలు, 20 మంది ITDP సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
నియోజకవర్గంలో కష్టపడిన వారిని కాదని.. వేరేవారికి టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బుల కోసం టికెట్‌ను రాంప్రసాద్‌రెడ్డికి అమ్ముకున్నారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు.