బాబు వైరస్ తో ఈసీకి ఇన్ఫెక్షన్ -సజ్జల

ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాయని, వైసీపీ గెలుపు మినహా ఊహాగానాలకు తావు లేదన్నారు సజ్జల.

Advertisement
Update:2024-05-28 14:24 IST

చంద్రబాబు అనే వైరస్ తో ఎన్నికల కమిషన్ కి ఇన్ఫెక్షన్ సోకిందని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వైఖరి మారిందని, అంపైర్ లా వ్యవహరించాల్సిన ఈసీ కక్షసాధింపు ధోరణిలో ఉందని అన్నారాయన. ఇప్పుడు సీఎస్ ని తప్పించాలనే కుట్ర జరుగుతోందన్నారు. టీడీపీ నేతల అరాచకాలను మాత్రం ఈసీ బయటపెట్టడంలేదని అన్నారు సజ్జల.


ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. 10-15 రోజులుగా మాచర్ల సెంటర్ గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తున్నాయని చెప్పారు. అసలు పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదన్నారు సజ్జల.

వైసీపీ తప్పు చేస్తే, టీడీపీ నేతలు రీపోలింగ్ చేయాలని అడగొచ్చుకదా అని ప్రశ్నించారు సజ్జల. వైసీపీ నేతలు బాధితులు కాబట్టే, రీపోలింగ్ చేయాలని అడిగారని గుర్తు చేశారు. ఏపీ ఎన్నికల వ్యవహారంలో ఈసీ పక్షపాతంగా వ్యవహరించింద్నారు సజ్జల. ఎన్ని అరాచకాలు సృష్టించినా వైసీపీ గెలుపుని ఎవరూ ఆపలేరన్నారు. ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాయని, వైసీపీ గెలుపు మినహా ఊహాగానాలకు తావు లేదన్నారు సజ్జల. 

Tags:    
Advertisement

Similar News