వాళ్లు జీవితంలో బాగుపడరు.. రోజా ఆగ్రహం

గతంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ ని కూడా కలిపి సెటైర్లు పేల్చారు. దీనిపై తాజాగా మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. ట్రోలర్లు జీవితంలో బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు.

Advertisement
Update:2022-11-29 15:16 IST

జగనన్న సాంస్కృతిక సంబరాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో ఇటీవల మంత్రి రోజా డ్యాన్స్ చేయడం, దానిపై ట్రోలింగ్స్ మొదలు కావడం తెలిసిన సంగతే. అయితే ఈ ట్రోలింగ్స్ కి ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చారు. కళాకారులను దూషించేవారు, అవమానించేవారు జీవితంలో బాగుపడరని హెచ్చరించారు. జగనన్న సాంస్కృతిక సంబరాలు తిరుపతి, గుంటూరులో పూర్తయ్యాయి. తాజాగా రాజమండ్రిలో వీటిని నిర్వహిస్తున్నారు. కళాకారులతో కలిసి రోజా డ్యాన్స్ చేయగా, సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ కి బాస్ పార్టీ సాంగ్ మ్యూజిక్ యాడ్ చేసి ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. గతంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ ని కూడా కలిపి సెటైర్లు పేల్చారు. దీనిపై తాజాగా మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. ట్రోలర్లు జీవితంలో బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు.

ఇటీవల జగనన్న క్రీడా సంబరాల్లో మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా సంబరాల్లో పాల్గొన్న రోజా నెటిజన్లకుబుక్కయ్యారు. ఇక టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కూడా రోజా తనదైన శైలిలో చెణుకులు విసిరారు.

నగరి ముద్దుబిడ్డ  నేను..

తాను 12 ఏళ్ల నుంచి నగరిలోనే ఉన్నానని, అందుకే నగరి ప్రజలు తనను ఆదరిస్తున్నారని తెలిపారు మంత్రి రోజా. పాయకరావుపేట ప్రజలు, కొవ్వూరు ప్రజలు అనితను చీత్కరించుకుని ఎన్నికల్లో తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఏపీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. కళాకారులకు జగన్ అండగా నిలబడుతున్నారని, సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం తమ ప్రభుత్వం అత్యథిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News