ఆర్జీవీ మౌనాన్ని భరించలేకపోతున్న ఎల్లో బ్యాచ్
ఆర్జీవీ మౌనంపై ఎల్లో బ్యాచ్ రచ్చ చేస్తోంది. వర్మకు ఫ్యూచర్ అర్థమైందని, అందుకే సైలెంట్ అయ్యారని రెచ్చగొడుతోంది.
ఏపీలో ఎన్నికల సీజన్ మొదలయ్యాక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హడావిడి అంతా ఇంతా కాదు. వ్యూహం సినిమాతో టీడీపీ బ్యాచ్ కి ముచ్చెమటలు పట్టించారాయన. పవన్ కల్యాణ్ పై కూడా ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టింగ్ లకు వైసీపీ కూడా విపరీతమైన ప్రచారం కల్పించేది. వైసీపీ అనఫిషియల్ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా ఆర్జీవీకి పేరు పడిపోయింది. అయితే సడన్ గా ఆయన సైలెంట్ అయ్యారు. ఆ సైలెన్స్ ని టీడీపీ భరించలేకపోవడం ఇక్కడ పెద్ద విశేషం.
ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచీ ఆర్జీవీ రాజకీయ ట్వీట్లు ఆపేశారు. కేవలం సినిమాల ప్రమోషన్ కోసమే ఆయన ట్విట్టర్ వాడుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, వైసీపీ ఎలివేషన్లు అన్నీ తగ్గిపోయాయి. చివరిగా షర్మిల విషయంలో మాత్రమే కౌంటర్లిచ్చారు వర్మ. ఎన్నికల రోజు కూడా ఆయన తెలుగు రాష్ట్రాల ఓటర్లకు ఎలాంటి పిలుపునివ్వలేదు. కనీసం ఆరోజు ఒక్క ట్వీట్ కూడా వేయలేదు.
ఆర్జీవీ మౌనంపై ఎల్లో బ్యాచ్ రచ్చ చేస్తోంది. వర్మకు ఫ్యూచర్ అర్థమైందని, అందుకే సైలెంట్ అయ్యారని రెచ్చగొడుతోంది. ఆర్జీవీ ట్వీట్లు వేసినా వారికి నచ్చదు, ఆయన మౌనం కూడా వారిని కుదురుగా ఉండనివ్వడం లేదని, సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం ఇస్తూ రామ్ గోపాల్ వర్మ ఘాటు రిప్లై ఇస్తారేమో చూడాలి.