వర్తకులపై అనుచిత వ్యాఖ్యలు.. మరో వర్గం దూరం అవుతోందా..?

టిప్పర్ డ్రైవర్ అంటూ హేళనగా మాట్లాడి.. శింగనమల సీటు వైసీపీకి ఖాయం చేశారు బాబు. ఇప్పుడు వర్తకులపై నిరాధార ఆరోపణలు చేసి ఆ వర్గాన్ని టీడీపీకి దూరం చేశారు.

Advertisement
Update:2024-04-04 18:07 IST

అధికారంలో ఉన్నప్పుడు బీసీలను, ఎస్సీలను చంద్రబాబు కించపరిచిన సంగతి తెలిసిందే. పోనీ అధికారం పోయిన తర్వాతయినా ఆయనలో మార్పు ఉంటుందా అనుకుంటే అదీ లేదు. ఇటీవలే టిప్పర్ డ్రైవర్లను హేళన చేస్తూ మాట్లాడారు బాబు. దీంతో ఆ వర్గం పూర్తిగా టీడీపీపై రివర్స్ అయింది. టిప్పర్ లారీతో గుద్దేస్తే సైకిల్ పరిస్థితి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూస్తారంటూ రగిలిపోతున్నారు డ్రైవర్లు. ఇప్పుడు వ్యాపార వర్గం కూడా చంద్రబాబుకి శాపనార్థాలు పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు వర్తకులు.

అసలేం జరిగింది..?

రావులపాలెం మీటింగ్ లో చంద్రబాబు నోరు జారారు. రావులపాలెంలో ప్రతి చోటా గంజాయి లభిస్తోందని విమర్శించే క్రమంలో కిరాణా షాపుల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని అన్నారు. కిరాణా వర్తకులను గంజాయి సప్లయర్స్ గా పేర్కొన్నారు. పోనీ ఎక్కడ అమ్ముతున్నారో, ఎవరు అమ్ముతున్నారో చంద్రబాబుకయినా తెలుసా అంటే అదీ లేదు. జగన్ ని తిట్టాలి, ఏపీని గంజాయి క్యాపిటల్ అంటూ సెటైర్లు వేయాలి.. ఇదీ ఆయన అనుకున్నది. అయితే మధ్యలో కిరాణా వర్తకులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో వర్తకులంతా బాబుని చెడామడా తిడుతున్నారు.




చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా రావులపాలెంలో వర్తకులు ఒకరోజు బంద్ కి పిలుపునిచ్చారు. కిరాణా షాపులన్నీ మూసివేసి, తమ నిరసన తెలియజేయాలని రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. అంతేకాదు, చంద్రబాబు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా కిరాణా వర్తకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, హేళన వ్యాఖ్యలతోనే వివిధ వర్గాలు చంద్రబాబుని శత్రువులా చూస్తున్నాయి. అయినా కూడా బాబు పంథా మారకపోవడం విచారకరం. టిప్పర్ డ్రైవర్ అంటూ హేళనగా మాట్లాడి.. శింగనమల సీటు వైసీపీకి ఖాయం చేశారు బాబు. ఇప్పుడు వర్తకులపై నిరాధార ఆరోపణలు చేసి ఆ వర్గాన్ని టీడీపీకి దూరం చేశారు. 

Tags:    
Advertisement

Similar News