ఆర్కే తిరిగివస్తే కూడా రామోజీరావుకు అక్కసే..
ఆర్కే తిరిగి వైసీపీలో చేరడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశలు గల్లంతయ్యాయి. మంగళగిరిలో లోకేష్ మరోసారి పరాజయం కావడం ఖరారైంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెంతకు చేరితే కూడా ఈనాడు అధినేత రామోజీరావుకు మింగుడు పడటం లేదు. అందుకే ఆర్కేపై ఆయన అక్కసుతో ‘రెండు నెలలకే.. మడమ తిప్పిన ఆర్కే’ అంటూ విషం చిమ్మారు. అసలు పరిస్థితి తెలుసుకుని, అసలు విషయం గ్రహించి ఆయన తిరిగి వైసీపీలోకి వస్తే రామోజీరావు పచ్చ రాతలు రాశారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్దకు అలా తిరిగి వస్తే రామోజీరావు ఏం రాసి ఉండేవారో ఊహించడం పెద్ద కష్టం కాదు.
ఆర్కే తిరిగి వైసీపీలో చేరడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశలు గల్లంతయ్యాయి. మంగళగిరిలో లోకేష్ మరోసారి పరాజయం కావడం ఖరారైంది. దాన్ని తట్టుకోలేక ఆర్కేపై పిచ్చి వ్యాఖ్యానంతో వార్తాకథనం రాయించారు. ఆర్కేకు ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలుసు. ఎమ్యెల్యేగా ఉంటూ ఓ మామూలు రైతులా ఆయన వ్యవసాయం చేసుకున్నారు. ఆయనకు ఇష్టమైన పని వ్యవసాయం చేయడం.
షర్మిల వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు. కనీస సీట్లయినా వస్తాయా అనేది సందేహమే. అందువల్ల ఆయన కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల లాభం లేదని అనుకుని ఉంటారు. చంద్రబాబు చెంతకు ఆయన చేరలేరు. చంద్రబాబుపై పోరాటంలో ఆయన మడవ తిప్పడం లేదు. ఆయన వేసిన కేసుల వల్లనే చంద్రబాబు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆ కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారు. అమరావతి భూబాగోతమంతా ఆర్కేకు తెలుసు. ఇది కూడా మనసులో పెట్టుకుని రామోజీరావు కక్షపూరితంగా ఆయనపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఇది ఎవరూ కాదనలేని నిజం.