అల్పపీడన ప్రభావంతో ఆ రోజుల్లో ఏపీలో వర్షాలు
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న విపత్తు నిర్వహణ సంస్థ
Advertisement
నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నది. ఈ ప్రభావంతో ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
Advertisement