చంద్రబాబు కోసం బాగానే కష్టపడ్డారు..

కిషన్ రెడ్డి ఏం చెప్పారో తెలియ‌దు కానీ లోకేష్‌ను కలవటానికి అమిత్ షా అంగీకరించారు. అందుకనే బుధవారం సాయంత్రం లోకేష్ అర్జంట్‌గా ఢిల్లీ వెళ్లారు.

Advertisement
Update:2023-10-12 11:32 IST

‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అని పెద్దలు చెప్పేది నిజమే అని తాజాగా మరోసారి నిరూపితమైంది. చంద్రబాబునాయుడు కోసం వ‌దిన కమ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎంతగా కష్టపడుతున్నారో అర్థ‌మైంది. పార్టీల పరంగా బీజేపీ - టీడీపీ ఉప్పు నిప్పని అందరికీ తెలిసిందే. విషయం ఏమిటంటే బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయ్యారు. చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని లోకేష్ ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని, భువనేశ్వరి, బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకేష్ ఇంకా చాలా ఫిర్యాదులు, తమ తరపున చాలా విజ్ఞప్తులు చేసుంటారనటంలో సందేహంలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే సడెన్‌గా లోకేష్‌కు అమిత్ షా అపాయిట్‌మెంట్ ఎలా దొరికింది? చాలా రోజులుగా లోకేష్ ఢిల్లీలో కూర్చుని ఢిల్లీ పెద్దల అపాయిట్‌మెంట్ల‌ కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యంకాలేదు. అమిత్ షా అపాయిట్‌మెంట్ తీసుకోవాలని లోకేష్ తరపున చాలామందే ప్రయత్నిస్తున్నారట. పురందేశ్వరి కూడా ట్రై చేసి ఫెయిలైనట్లు సమాచారం.

ఎందుకంటే లోకేష్‌ను కలవటానికి అమిత్ షా ఇష్టపడటంలేదని పార్టీవర్గాలు చెప్పాయి. అలాంటిది సడెన్‌గా అపాయిట్‌మెంట్ ఎలా దొరికింది? ఎలాగంటే తాను ట్రై చేయటం మానేసి కేంద్రమంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా పురందేశ్వరి ట్రై చేసినట్లు సమాచారం. కిషన్ ఏం చెప్పారో తెలియ‌దు కానీ లోకేష్‌ను కలవటానికి అమిత్ షా అంగీకరించారు. అందుకనే బుధవారం సాయంత్రం లోకేష్ అర్జంట్‌గా ఢిల్లీ వెళ్లారు.

పిన్ని పురందేశ్వరి+కిషన్ దగ్గరుండి లోకేష్‌ను అమిత్ షా వ‌ద్ద‌కు తీసుకెళ్ళారు. అమిత్ - లోకేష్ భేటీలో కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా ఉన్నారు. కిషన్ పూనుకోకపోయుంటే లోకేష్‌కు అమిత్ షా అపాయిట్‌మెంట్ దొరికేది కాదని సమాచారం. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు కోసం వ‌దిన పురందేశ్వరి బాగానే శ్రమ తీసుకుంటున్నట్లు అర్థ‌మవుతోంది. వీళ్ళ భేటీ తర్వాత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారనే ఆరోపణలకు ఇపుడేమి సమాధానం చెబుతారని పురందేశ్వరి ట్వీట్లో ప్రశ్నించారు. నిజానికి బీజేపీ పెద్దలున్నారని ఆరోపించింది సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే. కాబట్టి తమ్ముళ్ళే సమాధానం చెప్పాలి.


Tags:    
Advertisement

Similar News