సాక్షిపై పురందేశ్వరి పరువు నష్టం దావా..

ఆ సంస్థకు చంద్రబాబు, పురందేశ్వరి బంధువులతో సంబంధం ఉన్నట్టు కథనాలొచ్చాయి. అయితే ఇక్కడ పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ కావడం విశేషం.

Advertisement
Update:2024-03-24 19:20 IST

ఏపీలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రచ్చకు కారణం అయింది. ఆ కంటైనర్ వెనక ఉంది ఆ పార్టీ అని ఈ పార్టీ, ఈ పార్టీ అని ఆ పార్టీ నిందలు వేసుకున్నాయి. సదరు ఆక్వా సంస్థ యజమానులు రాజకీయ నాయకులతో కలసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా పరువునష్టం దావా అంటూ కలకలం రేపారు. సాక్షి పత్రికకు ఆమె పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. నిరాధార వార్తలు ప్రచురించారని రూ.20కోట్లకు పరువు నష్టం దావా వేబోతున్నట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము కూడా భాగస్వాములం అన్నట్టు సాక్షిలో వార్తలిచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరువు నష్టం దావా వేయబోతున్నట్టుగా ఆమె సాక్షికి నోటీసులు పంపించారు.

మరి ఈనాడు సంగతేంటి..?

ఈనాడులో కూడా ఇలాంటి తప్పుడు వార్తలే వచ్చాయి. సీబీఐ అధికారులు పోర్టుకి వచ్చిన సందర్భంలో స్థానిక పోలీసులు వారికి సహకరించలేదని అందుకే దర్యాప్తు ఆలస్యమవుతోందని ఈనాడు కథనాలిచ్చింది. ఆ తర్వాత విశాఖ పోలీస్ అధికారులు ఆ వార్తకు వివరణ ఇచ్చారు కూడా. తప్పుడు వార్తలు రాయొద్దని హెచ్చరించారు. అదే సమయంలో వైసీపీ నేతలతో సంధ్య ఎక్స్ పోర్ట్ సంస్థకు సంబంధాలున్నాయని కూడా ఈనాడు వార్తలిచ్చింది. ఆ సంస్థకు చంద్రబాబు, పురందేశ్వరి బంధువులతో సంబంధం ఉన్నట్టు కథనాలొచ్చాయి. అయితే ఇక్కడ పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ కావడం విశేషం.

విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసుని సీబీఐ డీల్ చేస్తోంది. ఈ కేసులో సంధ్య ఎక్స్ పోర్ట్స్ యాజమాన్యం నిందితులుగా తేలే అవకాశముంది. ఆ సంస్థతో పురందేశ్వరి బంధువులకు వాటాలున్నాయనేది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశం. ఆ ప్రచారం జనంలోకి బలంగా వెళ్లడంతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. అందుకే పరువు నష్టం దావా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News