పవన్ కళ్యాణ్‌కి కంచె ఐలయ్య మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్..
అసలు ఇంటర్మీడియటే పూర్తి కానీ వ్యక్తికి ఇంగ్లిష్ మీడియం చదువుల గొప్పతనం ఎలా తెలుస్తుంది. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఈ విధానంతో రానున్న పదేండ్లలో విద్యలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ప్రముఖ రచయిత, సామాజికకార్యకర్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏపీలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సర్కారు విద్య రూపురేఖలను మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. దానికి ప్రభుత్వం ఎందుకు వేల కోట్లను ఖర్చు చేసి అమలు చేయాలని పేద విద్యార్థులు చదువుకునే సర్కారు బడుల గురించి విమర్శించారు. అప్పట్లో పవన్ వ్యాఖ్యలపై ప్రజలతో పాటు మేధావుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
తాజాగా ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ``అసలు ఇంటర్మీడియటే పూర్తి కానీ వ్యక్తికి ఇంగ్లిష్ మీడియం చదువుల గొప్పతనం ఎలా తెలుస్తుంది. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఈ విధానంతో రానున్న పదేండ్లలో విద్యలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుండి ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఉపయోగపడే మేధావులు, ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు. పల్లెటూరు మట్టిలో ఉన్న మాణిక్యాలను జగన్ వెలికితీస్తుంటే ఓర్వలేని చంద్రబాబు, పవన్ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం కోసం ప్రభుత్వం ఎందుకు బడ్జెట్లో అన్ని వేల కోట్లు పెడుతున్నారని విమర్శిస్తున్న పవన్ కు సూటి ప్రశ్న వేస్తున్నాను. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి బడ్జెట్ కేటాయించకపోతే తాను నటించే సినిమాలకు ప్రభుత్వాన్ని బడ్జెట్ ను కేటాయించాలా..?`` అని కౌంటర్ వేశారు కంచె ఐలయ్య.