ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు - నట్టి కుమార్

ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసేలా ఉందన్నారు. అందుకే తాము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా ఒక సినిమా వ్యక్తి అయి ఉండి ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-06-01 21:08 IST

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా కొత్త సినిమాలను విడుదలైన రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ కార్యక్రమాన్ని శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. డబ్బు చెల్లించడం ద్వారా కొత్త సినిమాలను విడుదలైన రోజే ఏపీ ఫైబర్ నెట్‌ వినియోగదారులు ఇంట్లో వీక్షించవచ్చు. అయితే ఈ ఆలోచనను నిర్మాత నట్టి కుమార్‌ వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసేలా ఉందన్నారు. అందుకే తాము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా ఒక సినిమా వ్యక్తి అయి ఉండి ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

సినీ పరిశ్రమకు చెందిన వివిధ సంఘాలతో చర్చించకుండానే ఈ విధానాన్ని నేరుగా ఆచరణలోకి తీసుకురావడం ఏమాత్రం సరైన పద్దతి కాదన్నారు. 2013లోనే ఎయిర్‌టెల్ డీటీహెచ్‌ ద్వారా ఇలా విడుదలైన రోజే సినిమాలను టీవీల్లో ప్రదర్శించే ప్రయత్నాలు జరిగాయని.. కానీ అది విజయవంతం కాలేదన్నారు. తమ సినిమాలు ఇచ్చేందుకు నిర్మాతలే ముందుకు రానప్పుడు ఈ పద్దతులు ఎలా విజయవంతమవుతాయని నట్టి కుమార్ ప్రశ్నించారు.

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సింగ్ జాయింట్ సెక్రటరీగా తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఈ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News