కాపు రిజర్వేషన్లంటే భయపడుతున్నారా?

వీళ్ళ భయం ఏమిటంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తే అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ తదితర సామాజికవర్గాల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయం చంద్రబాబు, పవన్‌ను నోరెత్తనీయటంలేదట.

Advertisement
Update:2023-02-12 11:53 IST

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల పరిస్ధితి చాలా విచిత్రంగా ఉంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది కీలకమైన డిమాండ్. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, కాపు సంక్షేమసేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య మాత్రమే పదేపదే డిమాండ్ చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని కానీ ఇవ్వలేమని కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పటంలేదు. వైసీపీ కంటే ఏదో సమస్య ఉందని అనుకుందాం మరి టీడీపీ, జనసేనలకు ఏమైంది?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అడగలేదు. సరే వీళ్ళకంటే ఏదో సమస్య ఉందని అనుకుంటే మరి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా ఎందుకని నోరెత్తటంలేదు. మామూలుగా అయితే జగన్‌కు మైనస్ అయ్యే ప్రతి పాయింటును వీళ్ళిద్దరు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు కదా.

కాపుకు రిజర్వేషన్ అనే డిమాండును వినిపిస్తే తమకు మైనస్ అవుతుందని చంద్రబాబు, పవన్ భయపడుతున్నారట. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018లో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాష్ట్రంలో అమలుకావటంలేదు. అగ్రవర్ణాల్లోని పేదల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ చంద్రబాబు జీవో కూడా ఇచ్చారు. దాన్ని అమలు చేయాలని కూడా ఇప్పుడు డిమాండ్ చేయలేకపోతున్నారు.

వీళ్ళ భయం ఏమిటంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తే అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ తదితర సామాజికవర్గాల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయం చంద్రబాబు, పవన్‌ను నోరెత్తనీయటంలేదట. అగ్రవర్ణాల్లోని జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్‌ను సర్దాల్సిన చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ అని కంపు చేసేశారు. ఇప్పుడు అదే రివర్సు కొడుతోందట. అందుకనే చంద్రబాబు, పవన్ నోరెత్తలేకపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News