పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి..

ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డి తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి హింస రాజేశారు.

Advertisement
Update:2024-05-17 12:28 IST

తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. 15వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలను బయటకు లాగి కొట్టారు. తాజాగా సీసీ ఫుటేజీ బయటపడటం సంచలనంగా మారింది.

రెచ్చగొట్టిన జేసీ..

ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డి తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి హింస రాజేశారు. ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైనే దాడికి యత్నించారు. అల్లర్లపై ఈసీ సీరియస్ అవడం సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలవడంతో పోలీసులు రెచ్చిపోయారు. శాంతిభద్రతల పర్యవేక్షణ పేరుతో పెద్దారెడ్డి ఇంటిపై దాడికి దిగారు.

టీడీపీ వల్లే బలి..

తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎస్పీ అమిత్‌బర్దర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో పాటు ఆయనపై శాఖాపరమైన విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్‌ సీఐ మురళీకృష్ణను కూడా ఈసీ సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రిలో జరిగిన ఘటనలపై నమోదైన ప్రతి కేసుపై విచారించేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంది.

Tags:    
Advertisement

Similar News