జనాలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చోవడానికి కాదు

కాంగ్రెస్‌కు ఓట్‌ షేర్‌ తక్కువని.. ఏపీలో ఆ పార్టీకే అస్తిత్వమే లేదన్నజగన్‌ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్‌

Advertisement
Update:2024-11-14 13:33 IST

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఓట్‌ షేర్‌ తక్కువని.. కాంగ్రెస్‌కు ఏపీలో అస్తిత్వమే లేదన్నారని.. 38 శాతం ఓట్‌ షేర్‌ వచ్చినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకూ, మాకూ తేడా లేదు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లండి.. ఎవరు ఇన్‌సిగ్నిఫికెంటో తెలుస్తుందన్నారు. ప్రజలు మీకు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చోవడానికి కాదు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి అన్నారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

వైసీపీ అధినేత జగన్‌ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్‌ను విలేకర్లు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఆయన నా సోదరి గురించి ఇక్కడ మాట్లాడవద్దు. వారికి 1.7 శాతం ఓట్‌ షేర్‌ మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అస్తిత్వమే లేదు. వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే షర్మిల స్పందించారు.

Tags:    
Advertisement

Similar News