ఫారెస్ట్ భూముల కబ్జా ఆరోపణలపై పెద్దిరెడ్డి ఆగ్రహం

ఫారెస్ట్ భూముల కబ్జాకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు

Advertisement
Update:2025-01-29 17:50 IST

ఫారెస్ట్ భూముల కబ్జాకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు కుట్రలు, కుత్రంతాలు ప్రజలకు తెలుసు అని పెద్దిరెడ్డి అన్నారు. 2001లో భూములు కొనుగోలు చేశానని మాజీ సీఎం మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారని ఆయన తెలిపారు. 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో తారు రోడ్డు వేసుకొనేందుకు తమకు పర్మిషన్ వచ్చిందని ఆయన అన్నారు.

ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను. చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. బాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలు అందరికీ తెలుసున్నారు. ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పెద్దిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు

Tags:    
Advertisement

Similar News