సినిమా డైలాగులే పార్టీని గెలిపిస్తాయా?

సినిమాల్లో తన ఇమేజిని పెంచేట్లుగా ఎన్ని డైలాగులు రాయించుకున్నా, చెప్పినా జనాలు నమ్మే రోజులు పోయాయి.

Advertisement
Update:2023-07-30 11:15 IST

సినిమా హీరోలు ఏదో భ్రమల్లో ఉన్నట్లే ఉన్నారు. అప్పుడెప్పుడో సినిమా డైలాగులు పంచ్ డైలాగుల్లా పేలి ఒకరికి అడ్వాంటేజ్ అయ్యిందన్నది వాస్తవం. కానీ ఆ తర్వాత సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన వాళ్ళెవరకీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా ‘బ్రో’ రిలీజైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రాజకీయాలపైన చాలా డైలాగులున్నట్లు టాక్. అంటే ఆ డైలాగులన్నీ పవన్ ఇమేజిని పెంచేవిగానే ఉంటాయనటంలో సందేహంలేదు.

సినిమాలో ఎందుకలాంటి డైలాగులు పెట్టారంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది ఆన్సర్. సినిమా డైలాగులతోనే జనాలు ఓట్లేసి గెలిపించేస్తారా అన్న ప్రశ్నకు కాదనే సమాధానమే వస్తుంది. సినిమాల్లో తన ఇమేజిని పెంచేట్లుగా ఎన్ని డైలాగులు రాయించుకున్నా, చెప్పినా జనాలు నమ్మే రోజులు పోయాయి. ఎలాగంటే 2009లో సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు రిలీజైన సినిమాల్లో కూడా ఇలాంటి డైలాగులను చాలా పెట్టారు.

ఆ సినిమాల్లో తాను ప్రజల మనిషినని, జనాలను ఉద్దరించటానికే అవతరించినట్లుగా బిల్డప్ ఇచ్చుకుని చిరంజీవి సినిమాల్లో చాలా డైలాగులే రాయించుకున్నారు. తీరా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఏమైంది? రెండు చోట్ల పోటీచేస్తే ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు. పార్టీకి 18 సీట్లొచ్చిందంతే. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి, కేంద్ర మంత్రి పదవి తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. సినిమాల్లో నుండి వచ్చి పోటీ చేసినవాళ్ళల్లో చాలామంది ఒకసారి గెలిచి తర్వాత ఓడిపోయి రాజకీయాల్లో ఫేడవుటైపోయారు.

అప్పుడెప్పుడో 1982లో ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టారు. అప్పట్లో ఎన్టీయార్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేముందు రిలీజైన సినిమాల్లో తన పర్సనాలిటీని బాగా ఎలివేట్ అయ్యేట్లుగా డైలాగులు రాయించుకున్నారు. అప్పట్లో ఎన్టీయార్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో జనాలకు కాంగ్రెస్ తప్ప వేరే దిక్కేలేదు. పొలిటికల్ వ్యాక్యూమ్ విపరీతంగా ఉన్నకాలంలో టీడీపీ పెట్టడంతో ఎన్టీయార్ సక్సెస్ అయ్యారు. సినిమాల్లో డైలాగులను జనాలు నమ్మారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీయార్ ఏమిటనేది జనాలకు అర్థ‌మైంది. అందుకనే 1989 ఎన్నికల్లో ఎన్టీయార్‌నే ఓడగొట్టారు. కాబట్టి సినిమాల్లో ఇమేజిని పెంచుకునేట్లుగా డైలాగులు రాయించుకున్నంత మాత్రాన వర్కవుటవ్వదని తెలుసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News