అనా వీర తిలకం.. రేణు శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ విజయం అనంతరం ఆయన భార్య అనా లెజ్నోవా.. వీరతిలకం దిద్ది హారతినిచ్చారు. అటు రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Update:2024-06-04 17:17 IST

పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయి తీవ్ర నిరాశకు గురైన పవన్.. ఈ ఏడాది ఘన విజయం సాధించారు. తనతోపాటు మరో 20మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. ఈసారి కేవలం పిఠాపురంకు ఫిక్స్ అయిన పవన్ 69,169 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందడం విశేషం. ఈ విజయంతో జనసేన సంబరాలు చేసుకుంటోంది.

వీర తిలకం..

పవన్ కల్యాణ్ విజయం అనంతరం ఆయన భార్య అనా లెజ్నోవా.. వీరతిలకం దిద్ది హారతినిచ్చారు. వారిద్దరితోపాటు అక్కడే పవన్ కుమారుడు అకీరా కూడా ఉన్నారు. పవన్ నివాసం వద్దకు వచ్చిన అభిమానులందరికీ అకీరా అభివాదం చేశారు. పవన్ విజయదరహాసంతో కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రేణు శుభాకాంక్షలు..

అటు రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవన్ విజయంతో ఆద్య, అకీరా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు రేణు. రేణు దేశాయ్ పోస్టింగ్ కూడా వైరల్ గా మారింది. 



Tags:    
Advertisement

Similar News